Friday, May 10, 2024

బైక్‎తో విన్యాసాలు చేస్తూ క్రాకర్స్ కాల్చిన యువకుడి అరెస్ట్.. వైరలవుతున్న వీడియో

spot_img

ఎవరైనా క్రాకర్స్ ఇంటి ముందో లేకపోతే ఇంటిపైనో కాలుస్తారు. కానీ, ఓ యువకుడు మాత్రం బైక్ మీద విన్యాసాలు చేస్తూ.. కాల్చాడు. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‎గా మారింది. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. స్పందించిన పోలీసులు ఓ యువకుడిని అరెస్ట్‌ చేశారు.

Read Also: ముందు వెళ్తున్న ట్రక్కును ఢీకొన్ని కారు.. ఆరుగురు మృతి

తిరుచ్చిలోని ఓ నేషనల్ హైవేపై కొంతమంది మిత్రులు బైకులతో సహా చేరారు. అక్కడ ఓ యువకుడు తన బైక్‌ ముందు ఉన్న లైట్‌ భాగంలో టపాసులను అమర్చాడు. ఆ తర్వాత వాటికి నిప్పు పెట్టి రోడ్డుపై వేగంగా దూసుకెళ్లాడు. ఆ సమయంలో బైక్‌ ముందు టైర్లను గాల్లోకి లేపి ప్రమాదకర స్టంట్స్‌ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను నవంబర్‌ 9న సోషల్‌ మీడియాలో పోస్టు చేయగా.. అదికాస్తా వైరల్‌ అయ్యింది. వీడియోలో పేర్కొన్న ఇన్‌స్టాగ్రామ్ పేజీ పేరు ‘డెవిల్ రైడర్’ని ఉపయోగించి, సదరు యువకుడిని గుర్తించి పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతడిపై సెక్షన్ 279 (నిర్లక్ష్యంగా వాహనం నడపడం), 286 (పేలుడు పదార్థాలకు సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించడం) మరియు 336 (ఇతరుల వ్యక్తిగత భద్రతకు హాని కలిగించే చట్టం) కింద కేసు నమోదు చేశారు.

Latest News

More Articles