Friday, May 10, 2024

మార్కెట్లోకి విజయ బ్రాండ్ గానుగ నూనెలు

spot_img

హైదరాబాద్ లోని మంత్రుల నివాస సముదాయంలో  విజయ బ్రాండ్ వేరుశెనగ గానుగనూనెను రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచెర్ల రామకృష్ణారెడ్డి, ఎండీ సురేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కల్తీలేని ఉత్పత్తులు ప్రభుత్వ లక్ష్యమన్నారు.

విజయ బ్రాండ్ నుండి నాణ్యమైన వంటనూనెలు.. ప్రజారోగ్యమే లక్ష్యంగా ఉత్పత్తులు ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేసినట్లు గుర్తుచేశారు. నాణ్యమైన వంటనూనెల తయారీపై దృష్టిపెట్టిన ఆయిల్ ఫెడ్, వేరుశెనగ, పొద్దుతిరుగుడు, నువ్వులు, కొబ్బరి, రైస్ బ్రాన్, పామాయిల్, గానుగ నూనెలు ఉత్పత్తి చేస్తున్నదని తెలిపారు.

విజయ బ్రాండ్ ఉత్పత్తులను అందరూ ఆదరించాలని కోరారు. హైదరాబాద్ లోని అన్ని రైతుబజార్లలో విజయ ఔట్ లెట్లు ఏర్పాటు చశామన్నారు. మొత్తం 33 జిల్లాకేంద్రాలలో ఔట్ లెట్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో లాభాల బాటలో ఆయిల్ ఫెడ్ నడుస్తోందని, ఏటా వెయ్యి కోట్ల టర్నోవర్ సాధించి వంద కోట్ల లాభాలలో ఆయిల్ ఫెడ్ ఉందని, కేవలం నూనె ఉత్పత్తులపై పది కోట్ల లాభం సాధిస్తుందన్నారు.

Latest News

More Articles