Friday, May 10, 2024

భారత్‎లోని ఆ ప్రాంతాల్లో పర్యటించొద్దు…కెనడా పౌరులకు ఆదేశం..!!

spot_img

భారత్, కెనడా మధ్య వివాదం ముదురుతోంది. ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు బలహీనపడుతున్నాయి. భారత్ పై ఘాటు వ్యాఖ్యలు చేసిన కెనడా ఇప్పుడు..తన పౌరులకు ప్రయాణ సలహాను జారీ చేసింది. భారత్ లో పర్యటించే కెనడా పౌరులు, లేదా భారత్ లో నివసిస్తున్న తన పౌరులను జమ్మూ కశ్మీర్, ఈశాన్య ప్రాంతాలకు వెళ్లొద్దని కోరింది. భద్రతా పరిస్థితుల దృష్ట్యా జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతానికి వెళ్లకుండా ఉండాలని కెనడా తన పౌరులకు సూచించింది.

తీవ్రంగా ఖండించిన భారత్..

ట్రూడో, పార్లమెంటు దిగువ సభ అయిన హౌస్ ఆఫ్ కామన్స్‌లో సోమవారం ప్రసంగిస్తూ, “కెనడియన్ పౌరుడు హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యలో భారత ప్రభుత్వ ఏజెంట్ ప్రమేయం ఉందనే తీవ్రమైన ఆరోపణలపై కెనడియన్ భద్రతా సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి” అని అన్నారు. ట్రూడో ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. ట్రూడో చేసిన ఆరోపణలన్నీ నిరాధారమైనవని కొట్టిపారేసింది. కెనడాలో ఏదైనా హింసాత్మక చర్య జరిగితే అందులో భారత్ ప్రమేయం ఉందన్న ఆరోపణలు అసంబద్ధమైనవి అని విదేశాంగ మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీలో ఒక ప్రకటనలో పేర్కొంది.

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ (KTF) చీఫ్ హర్దీప్ సింగ్ నిజ్జర్ జూన్ 18న కెనడా గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపారు. నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉండవచ్చని కెనడా ప్రధాని ట్రూడో చేసిన ఆరోపణలను విదేశాంగ మంత్రిత్వ శాఖ  తోసిపుచ్చింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ, ‘భారతదేశం ప్రజాస్వామ్య దేశం, ఇది చట్టబద్ధమైన పాలనకు కట్టుబడి ఉంది’ అని పేర్కొంది.

కెనడియన్ గడ్డపై కెనడియన్ పౌరుడిని హత్య చేయడంలో విదేశీ ప్రభుత్వం ఏదైనా ప్రమేయం ఉంటే అది ఆమోదయోగ్యం కాదు. మన సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించడమేనని ట్రూడో ఎంపీలకు చెప్పారు. ‘స్వేచ్ఛ, బహిరంగ, ప్రజాస్వామ్య సమాజం యొక్క ప్రవర్తనను నిర్ణయించే ప్రాథమిక నియమాలకు ఇది విరుద్ధం’ అని ఆయన అన్నారు.”మీరు ఊహించినట్లుగానే, మేము ఈ తీవ్రమైన విషయంపై మా భాగస్వాములతో కలిసి పని చేస్తున్నాము” అని ట్రూడో చెప్పారు. ఈ నెల ప్రారంభంలో న్యూఢిల్లీలో జరిగిన జి20 సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావించినట్లు కెనడా ప్రధాని తెలిపారు.

కెనడాలో నివసిస్తున్న నిజ్జర్‌ను 2020 జూలైలో కఠినమైన చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (UAPA) కింద భారత్ టెర్రరిస్టుగా ప్రకటించింది. NIA) సెప్టెంబర్ 2020లో దేశంలోని నిజ్జర్ ఆస్తులను అటాచ్ చేసింది. ఇంటర్‌పోల్ 2016లో నిజ్జర్‌పై రెడ్ కార్నర్ నోటీసు కూడా జారీ చేసింది. ఉగ్రవాద కార్యకలాపాల్లో ప్రమేయం ఉందనే అనుమానంతో సర్రే స్థానిక పోలీసులు 2018లో నిజ్జర్‌ను తాత్కాలిక గృహనిర్బంధంలో ఉంచారు, అయితే ఆ తర్వాత అతన్ని విడుదల చేశారు. కెనడాలో సిక్కు జనాభా 7,70,000 కంటే ఎక్కువ. ఈ సంఖ్య దేశ మొత్తం జనాభాలో రెండు శాతం.

More News..

Latest News

More Articles