Friday, May 10, 2024

కాంగ్రెస్‌కు ఓటు వేయొద్దు.. కర్ణాటక రైతుల నిరసన

spot_img

సంగారెడ్డి జిల్లా: నారాయణఖేడ్‌లో కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా కర్ణాటక రాష్ట్రానికి చెందిన రైతులు చేపట్టారు. కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు హామీలు అమలు కావడం లేదంటూ ప్రకార్డులను ప్రదర్శించారు. తెలంగాణ పౌరులు కాంగ్రెస్‌కు ఓటు వేయొద్దని నినాదాలు చేశారు. వారిని స్థానిక కాంగ్రెస్‌ నేతలు అడ్డుకున్నారు. ప్లకార్డులను చించివేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాల వారిని చెదరగొట్టారు. కర్ణాటక రైతు సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ.. కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావడం లేదన్నారు. తెలంగాణ వాసులు కాంగ్రెస్ హామీలను నమ్మి మోసపోవద్దని కోరారు.

Also Read.. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఆగం కాక తప్పదు

వికారాబాద్‌ జిల్లా పరిగిలోనూ కర్ణాటకకు చెందిన పలువురు అన్నదాతుల నిరసన తెలిపారు. కాంగ్రెస్‌ ప్రకటించిన 6 గ్యారెంటీలు అమలు కావడం లేదంటూ ఆ పార్టీకి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. పరిగిలోని కొడంగల్‌ చౌరస్తా నుంచి బస్టాండ్‌ వరకు రైతులు ర్యాలీ నిర్వహించారు. పరిగిలో రేవంత్‌ రెడ్డి రోడ్‌ షోకు ముందు కర్ణాటక రైతులు ఆందోళన చేయడం అందరిని ఆకర్షించింది. స్థానిక కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు కర్ణాటక రైతుల నుంచి ప్లకార్డులు లాక్కున్నారు.

Latest News

More Articles