Wednesday, May 8, 2024

పాక్‌లో వరుస బాంబు పేలుళ్లు.. 50 మందికి పైగా మృతి

spot_img

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ వరుస బాంబుల మోతతో దద్దరిల్లింది. గంటల వ్యవధిలో రెండు వేర్వేరు చోట్ల బాంబు పేలుళ్లు సంభవించాయి. బలుచిస్థాన్‌ ప్రావిన్స్‌లో జరిగిన ఆత్మాహుతి దాడిలో 52 మంది ప్రాణాలు కోల్పోగా..  తాజాగా ఖైబర్‌ పఖ్తుంఖ్వాలో మరో బాంబు పేలుడు జరిగింది. ఈ ఘటనలో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.

Also Read.. వన్డే ప్రపంచకప్ 2023: సెమీ ఫైనల్కు వెళ్లే జట్లు ఏవో చెప్పేసిన క్రికెట్ దిగ్గజాలు

పాక్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మిలాద్‌ ఉన్‌ నబీని పురస్కరించుకుని దోబా పోలీస్‌స్టేషన్‌ సమీపంలోని మసీదులో ప్రార్థనలు చేసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు చేరుకున్నారు. ఐదుగురు ఉగ్రవాదులు దోబా స్టేషన్‌లోకి ప్రవేశించి పోలీసులపైకి కాల్పులు జరిపారు. పోలీసులు ఎదురుకాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. మిగతావారు అక్కడి నుంచి తప్పించుకునే క్రమంలో బాంబులు విసరడంతో ప్రాణనష్టం పెరిగిందని డిప్యూటీ కమిషనర్‌ ఫజల్‌ అక్బర్‌ వెల్లడించారు.

మరిన్ని వార్తలు..

బాలాపూర్ గణేష్ లడ్డూకు రికార్డు ధర.. డబ్బు చెల్లింపులో కొత్త నిబంధన
చిన్నారి దీక్షిత్ రెడ్డిని చంపినోడికి ఉరి శిక్ష.. పాలాభిషేకాలతో సంబరాలు
పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అయిన కూతురు.. కుటుంబ సభ్యుల దాడి

Latest News

More Articles