Wednesday, May 8, 2024

గాంధీ భవన్ లోనే గాడ్సే ఉన్నడు.. మోడీ జాకీ పెట్టి లేపిన బీజేపీ లేవదు

spot_img

బాన్సువాడ: మన రాష్ట్రంలో టన్నుల కొద్దీ వరి ధాన్యం పండిస్తే కాంగ్రెస్, బిజెపి నాయకులు మనసున పడుతలేదని రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. ఈరోజు ఆయన బాన్సువాడ కృతజ్ఞత సభలో పాల్గొని మాట్లాడారు. పరిపాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు, కొత్త మండలాలు, తండాలు గ్రామ పంచాయతీలుగా మార్చుకున్నామని తెలిపారు. మన రాష్ట్రంలో 24 గంటల కరెంట్ లేదన్న కాంగ్రెస్ నాయకులు విద్యుత్ వైర్లను పట్టుకుంటే కరెంట్ ఉందో లేదో తెలుస్తుందని సెటైర్లు వేశారు.

‘‘2014 కు ముందు గ్రామాల్లో ఒక వ్యక్తి చనిపోతే స్నానాలు చేసేందుకు బ్రతిమలాడి కరెంట్ తీసుకునేవారు. పోచారం శ్రీనివాసరెడ్డి వ్యవసాయ మంత్రిగా ఉన్నప్పుడు రైతు బంధు అనే పథకం ప్రవేశపెట్టడం జరిగింది. 60 ఏళ్ల పాలనలో రైతులకు రైతు బంధు ఇవ్వాలని ఎవరూ ఆలోచించలేదు. దివ్యంగులకు 4 వేల పెన్షన్ ఇస్తున్న భారతదేశంలో ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. పాఠశాల పిల్లలకు త్వరలో బ్రేక్ ఫాస్ట్ అనే కార్యక్రమం ప్రారంభం కాబోతుంది.

Also Read.. 16వ తేదికి సిద్ధం కండి.. వరంగల్ నడిబొడ్డున కేసీఆర్ కీలక ప్రకటన

ఇటింటికి నీళ్ళు ఇవ్వకుంటే మళ్ళీ ఓటు అడగా అని ధైర్యంగా ఛాలెంజ్ చేసిన నాయకుడు కేసీఆర్. ఎస్ఆర్ ఎస్పీకి పునర్జీవన పథకం ద్వారా గోదావరి నీళ్ళు తెచ్చిన ఘనత కేసీఆర్ ది. గంగను కింది నుండి పైకి తెచ్చి ఒక అద్భుతం సృష్టించిన నాయకుడు కేసీఆర్. 60 ఏళ్లు అధికారంలో ఉండి కరెంట్ కష్టాలు తీర్చని కాంగ్రెస్ నాయకులకు మళ్ళీ ఓట్లు వేస్తామా.

Also Read.. తెలంగాణలో 3.17 కోట్ల మంది ఓటర్లు

అభివృద్ధి చేసిన పోచారం శ్రీనివాస్ రెడ్డి వైపు ఉందామా, కరెంట్ కష్టాలు తీర్చని కాంగ్రెస్ వైపు ఉంటారో ప్రజలు నిర్ణయించుకోవాలి. 11,000 డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టించిన ఏకైక నాయకుడు పోచారం శ్రీనివాసరెడ్డి. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు డబ్బులు ఇస్తే తీసుకోండి ఓటు మాత్రం పోచారం శ్రీనివాసరెడ్డి కే వేయాలి. మోసాన్ని మోసంతోనే జయించాలి.

Also Read.. అభివృద్ధి ఆగొద్దంటే మళ్ళీ సీఎం కేసీఆర్ నే గెలిపించండి

మన రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఉంటేనే రాష్టం సుభిక్షంగా ఉంటుంది. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి చేష్టలు ఓటుకు నోటు అన్నట్టు అనాడు,  సీటుకు నోటు అన్నట్టు ఇప్పుడు ఉన్నాయి. అరిచేతుల్లో స్వర్గం చూపించే నాయకులను నమ్మద్దు. ప్రతిపక్షాల మానిఫెస్టో కన్న తాతలాగా మన మేనిఫెస్టో ఉంటుంది.

Also Read.. ప్రపంచ కప్ చరిత్ర: భారత టాప్ 10 బ్యాటర్లు, వికెట్ టేకర్స్ గురించి తెలుసా?

రేవంత్ రెడ్డి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మనిషి. గాంధీ భవన్ లోనే గాడ్సే ఉన్నట్టు మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు. మన రాష్ట్రం నుండి పన్నుల రూపంలో కేంద్రానికి కట్టిన డబ్బుల నుండి 46 శాతం పైసలు మనకు వస్తున్నాయి. మన రాష్ట్రంలో బిజెపి పార్టీని మోదీ జాకీలు పెట్టీ లేపిన లేచే పరిస్థితి లేదు. బాన్సువాడ నుండి లక్ష మెజారిటీతో పోచారం శ్రీనివాసరెడ్డి ని గెలిపించాలి.’’ అని మంత్రి కేటీఆర్ ప్రజలను కోరారు.

Latest News

More Articles